ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..
- September 20, 2023
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేజీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అయితే, కేవలం టీజర్ పేజీ మాత్రమే. ఈ సేల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్లాట్‌ఫాం తెలిపింది. అక్టోబర్ ప్రారంభంలో సేల్ ప్రారంభమవుతాయని అనేక డివైజ్‌లకు భారీ డిస్కౌంట్లకు లభిస్తాయని లిస్టింగ్ సూచిస్తుంది.
ఈ-కామర్స్ దిగ్గజం దీపావళి పండుగకు వారాల ముందు వివిధ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌పై పెద్ద డిస్కౌంట్లను అందిస్తుంది. ఏడాదిలో అతిపెద్ద ఫ్లిప్‌కార్ట్ విక్రయాలలో ఒకటిగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సేల్ పేజీ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటివరకు అతి తక్కువ ధరకు లభిస్తాయని వెల్లడించింది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G, ఐఫోన్‌లు కూడా ఉన్నాయి. కంపెనీ డివైజ్ పేర్లను వెల్లడించలేదు.
కానీ, టీజర్ పేజీ ఐఫోన్ డీల్స్ అక్టోబర్ 1న వెల్లడి కానుందని ధృవీకరించింది. Samsung, Realme ఫోన్ డీల్‌లు వరుసగా అక్టోబర్ 3, అక్టోబర్ 6న లైవ్ పేజీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా, రెడ్‌మి ఫోన్ అభిమానులు అక్టోబర్ 7 వరకు వేచి ఉండవలసి ఉంటుంది. ఒప్పో డీల్స్ అక్టోబర్ 8న లిస్ట్ కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ కూడా అక్టోబర్ 8న పోకో ఫోన్ డీల్స్ వెల్లడించాలని యోచిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో, ప్లాట్‌ఫారమ్ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై 50 నుంచి 80 శాతం డిస్కౌంట్ అందిస్తామని హామీ ఇచ్చింది.
జాబితా ప్రకారం.. ఇయర్‌ఫోన్‌ల ధర రూ. 499, కీబోర్డుల ధర రూ. 99 నుంచి ప్రారంభమవుతుంది. వైడ్ స్క్రీన్ మానిటర్‌లు 70 శాతం వరకు తగ్గింపు ఆఫర్‌ను కలిగి ఉంటాయి. ప్రింటర్‌లు 60 శాతం వరకు పొందుతాయి. తగ్గింపు ధరలకు టీవీలు, ఇతర అప్లియన్సెస్ కొనుగోలుకు వేచి ఉన్న వారికి, ఫ్లిప్‌కార్ట్ 80 శాతం వరకు డిస్కౌంట్ అందించవచ్చు. కొన్ని పాపులర్ 4K స్మార్ట్ టీవీలు ప్లాట్‌ఫారమ్‌పై 75 శాతం వరకు తగ్గింపును అందిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో రష్ అవర్స్ డీల్‌లు, బంపర్ వాల్యూ అవర్స్, సూపర్ వాల్యూ కాంబోస్ మరిన్ని ఉంటాయి.
మిగిలిన వివరాలు ప్రస్తుతం తెలియరాలేదు. కానీ, ఐఫోన్ 13, ఐఫోన్ 14 కొన్ని డిస్కౌంట్లను పొందవచ్చు. ఎందుకంటే.. కంపెనీ ప్రతి ఏడాదిలో పాత ఐఫోన్‌లపై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తుంది. ఈ సేల్ తేదీలు, డీల్‌లు వెల్లడవుతాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 52,999 ధర ట్యాగ్‌తో లిస్టు అయింది. మరోవైపు ఐఫోన్ 14 రూ.64,999కి విక్రయిస్తోంది. అయినప్పటికీ, గత ఏడాదిలో మోడల్ కన్నా ఐఫోన్ 13 కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. రెండూ ఫీచర్లు, పర్ఫార్మెన్స్ పరంగా సమానంగా ఉంటాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









