అబుధాబి బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో జాక్‌పాట్ కొట్టిన స్కూల్ బస్ డ్రైవర్
- September 23, 2023
అబుధాబి: అబుధాబి బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో భారతీయ డ్రైవర్ జాక్‌పాట్ కొట్టాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో అబుధాబిలో స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారత ప్రవాసుడు రియాస్ పరంబత్‌కండి 1లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నాడు.కాగా, అతడు బిగ్ టికెట్ లాటరీలో ఇలా జాక్‌పాట్ కొట్టడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2012లో కూడా ఒకసారి మనోడికి లాటరీ తగిలింది. ఇలా అతనికి రెండోసారి అదృష్టం కలిసొచ్చి భారీ ప్రైజ్‌మనీ సొంతమైంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన రియాస్ 17 ఏళ్ల నుంచి అబుధాబిలో ఉంటున్నాడు. 2008 నుంచి బిగ్ టికెట్ రాఫెల్లో పాల్గొంటున్నాడు. 15 మంది స్నేహితులతో కలిసి క్రమం తప్పకుండా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. ఈ స్నేహితుల బృందం తొలిసారి 2012లో 40వేల దిర్హమ్స్ గెలుచుకుంది. ఆ తర్వాత ఇప్పుడు 1లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా రియాస్ మాట్లాడుతూ.. "ఇలా భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మళ్లీ గెలుస్తానని నాకు తెలుసు. నేను పనిలో ఉన్నందున బిగ్ టికెట్ నిర్వాహకుల కాల్కి సమాధానం ఇవ్వలేకపోయాను. నా స్నేహితుడు బిగ్ టికెట్ వెబ్సైట్లో చూసి నా పేరు ఉందని చెప్పాడు. దాంతో వెంటనే నేను ఈ విషయాన్ని నా ఫ్యామిలీతో పంచుకున్నాను. వారందరూ ఎంతో ఆనంద పడ్డారు" అని అన్నాడు. ఇక తాను గెలుచున్న ఈ ప్రైజ్‌మనీని తన స్నేహితులతో పంచుకుంటానని చెప్పాడు. అలాగే తన భార్య, పిల్లలను రెండు నెలల అబుదాబి ట్రిప్‌నకు తీసుకువస్తాని చెప్పుకొచ్చాడు. ఇకపై కూడా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తూనే ఉంటామని చెప్పిన రియాస్.. ఏదో ఒకరోజు గ్రాండ్‌ప్రైజ్ విన్ అవుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







