ప్రతిష్టాత్మక FIH హాకీ ఒలింపిక్ క్వాలిఫైయర్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఒమన్
- September 29, 2023
మస్కట్: వచ్చే ఏడాది జనవరి 15-21మధ్య మస్కట్‌లో ప్రతిష్టాత్మకమైన FIH హాకీ ఒలింపిక్ క్వాలిఫైయర్‌కు ఒమన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఒమన్ హాకీ అసోసియేషన్ (OHA) అధ్యక్షుడు డాక్టర్ మార్వాన్ అల్ జుమా మాట్లాడుతూ.. ఇది ప్రతిష్టాత్మక టోర్నమెంట్ అని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం.. దీనిని పాకిస్తాన్ లో నిర్వహించాల్సి ఉంది. జనవరి 24, 2024న ప్రారంభమయ్యే ఎఫ్ఐహెచ్ హాకీ5 వరల్డ్ కప్‌కు ముందుగానే ఈ ఈవెంట్ నిర్వహించబడుతుందన్నారు.
ఈ FIH హాకీ ఒలింపిక్ క్వాలిఫైయర్స్ ద్వారా ఆరు మహిళలు, ఆరు పురుషుల జట్లు పారిస్ 2024కి అర్హత సాధిస్తాయి. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ (మహిళలు మరియు పురుషులు) ఇప్పటికే పారిస్ 2024 హాకీ ఒలింపిక్ టోర్నమెంట్లలో వరుసగా 2023 ఓషియానియా కప్ మరియు యూరోహాకీ ఛాంపియన్షిప్లను గెలుచుకోవడం ద్వారా తమ స్థానాన్ని దక్కించుకున్నాయి. ప్రస్తుతం హాంగ్జౌ చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలలో అలాగే రాబోయే పాన్ అమెరికన్ గేమ్స్ , ఆఫ్రికన్ హాకీ రోడ్ టు పారిస్ టోర్నమెంట్ ద్వారా వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు (3 మహిళలు, 3 పురుషుల జట్లు) నేరుగా అర్హత సాధిస్తాయి. పారిస్ 2024 హాకీ ఒలింపిక్ టోర్నమెంట్లు వచ్చే ఏడాది జూలై 27 నుండి ఆగస్టు 9 వరకు జరుగుతాయి.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







