రియాద్ సీజన్ 2023: టిక్కెట్ల బుకింగ్ కోసం వెబ్సైట్ ప్రారంభం
- October 11, 2023
రియాద్: సౌదీ జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) చైర్మన్ టర్కీ అల్-షేక్ రియాద్ సీజన్ 2023 టిక్కెట్ల రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్సైట్(Webook.com)ను ప్రారంభించారు. ‘బిగ్ టైమ్’ నినాదంతో సీజన్ అక్టోబర్ 28న ప్రారంభమవుతుంది. ఈవెంట్లు, ఆఫర్లు మరియు టిక్కెట్లతో సహా సీజన్‌కు సంబంధించిన ప్రతిదాన్ని వెబ్సైట్ అందిస్తుందని అల్-షేక్ చెప్పారు. అక్టోబర్ 25, 26వ తేదీలలో రెండు ప్రత్యేక కచేరీలు ఉంటాయని, వాటిని ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. వెబ్సైట్లో నమోదు చేసుకున్న వారికి లగ్జరీ కారు బహుమతి కోసం ప్రశ్నలు, డ్రాలతో కూడిన పోటీ గురించి అల్-షేక్ వెల్లడించారు. ఈ సీజన్లో టిక్కెట్లు నమోదు చేసుకొని కొనుగోలు చేస్తున్న వారి నుంచి పోటీకి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. సీజన్లో దాదాపు 60 శాతం ఈవెంట్లు కొత్త అనుభవాలుగా ఉంటాయని అల్-షేక్ ముందుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







