ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
- January 25, 2024
అమరావతి: శస్త్ర చికిత్సల ప్యాకేజీల పెంపు, బకాయి బిల్లుల చెల్లింపు, ఆసుపత్రులు- ట్రస్ట్ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ఏపీ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మెకు దిగాయి. నేటి (గురువారం) నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్య సంఘం తెలిపింది. ప్రస్తుతం అడ్మిషన్లలో ఉన్న రోగులకు యథావిధిగా సేవలు కొనసాగనున్నాయని, కొత్త రోగులను చేర్చుకోబోమని తెలిపాయి.
నిజానికి గత ఏడాది డిసెంబరు 29 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. అయితే ప్రభుత్వం చర్చలకు పిలవడంతో సమ్మెను విరమించుకున్నారు. హామీ మేరకు ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చలేదంటూ ఇప్పుడు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







