ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- May 02, 2024
యూఏఈ: భారీ వర్షాల అలెర్ట్ నేపధ్యంలో దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లు, రెండు స్థానిక విమానయాన సంస్థలు కీలక సూచనలు జారీ చేశారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చేటప్పుడు ఎదురయ్యే వర్షం మరియు ట్రాఫిక్ సమస్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రారంభించాలని, కారులో లేదా ప్రజా రవాణాలో ప్రయాణిస్తున్నప్పుడు విమానాశ్రయానికి సకాలంలో చేరుకోవడానికి కొంత అదనపు ప్రయాణ సమయాన్ని కేటాయించాలని కోరారు. ఈ మేరకు దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) మరియు అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DWC) ప్రయాణీకులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని తమ ప్రకటనల్లో కోరాయి. రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు మరియు ప్రత్యామ్నాయ మార్గాల కోసం స్మార్ట్ యాప్‌లను ఉపయోగించాలని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధి తెలిపారు.
ప్రయాణీకులు తమ విమానాల అప్డేట్స్ ను తమ ఎయిర్‌లైన్ సిబ్బందితో చెక్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







