మంకీపాక్స్ విజృంభణతో అప్రమత్తమైన కేంద్రం-ఐసోలేషన్...
- August 19, 2024
న్యూ ఢిల్లీ: ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి, వారికి వైద్యం అందిచడానికి ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని అధికారులకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అలాగే దిల్లీలో మూడు నోడల్ ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అనుమానితులకు RT-PCR వ్యాధి నిర్థరణ పరీక్ష చేయాలని మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఆఫ్రికాలో ఈ ఏడాది 18 వేలకుపైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. పొరుగుదేశం పాకిస్తాన్‌లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. మంకీపాక్స్ కేసుల్లో మరణాల రేటు 1 నుంచి 10 శాతం వరకు ఉంది.
మంకీపాక్స్ లక్షణాలు ఇవే!
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, మంకీపాక్స్ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ వంటివి సాధారణంగా కనిపిస్తాయి. ఇవి దాదాపు 2 నుంచి 4 వారాలపాటు కొనసాగవచ్చు. ఇది సదరు వ్యక్తి ఇమ్యూనిటీ పవర్‌పై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి నోరు, కళ్లు, గొంతు, ప్రైవేట్ భాగాలపై పొక్కులు రావొచ్చు.
దీని నుంచి ఎలా నివారించుకోవాలంటే?
మంకీపాక్స్ లాగా కనిపించే దద్దుర్లు ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మంకీపాక్స్ వైరస్ సోకిన జంతువు లేదా వ్యక్తితో సంబంధం ఉన్న బట్టలు, దుప్పట్లు లేదా ఇతర వస్తువులను తాకకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు సబ్బు నీటితో చేతులను శుభ్రంగా వాష్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ చేతులు కడుక్కోవడానికి ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ని యూజ్ చేయాలి. చివరగా దీని బారిన పడకుండా ఉండాలంటే ఈ వ్యాధి లక్షణాలను తెలుసుకొని, అప్రమత్తంగా ఉండాలి.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







