తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు
- October 09, 2024
టొరంటో: తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో టొరంటో కెనడా నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
ఈ సంబరాలలో 2500కు పైగా తెలంగాణ వాసులు స్థానిక లింకన్ అలెగ్జాండర్ సెకండరీ స్కూల్ - మిస్సిసాగాలో జరిగిన వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పండుగను బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు ఆట పాటలతో బతుకమ్మ ఆట సుమారు 5 గంటలు ఏకధాటిగా జరిగింది. చివరగా 'పోయిరావమ్మ గౌరమ్మ' పాటతో ఊరేగిపుంగా వెళ్లి నిమజ్జనం చేశారు. తరువాత సత్తుపిండి, నువ్వులపిండి, పల్లీలపిండి ప్రసాదం పంపిణి చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంఘం వారి అధికారిక తెలుగు పత్రిక టీసీఏ బతుకమ్మ సంచికను గుప్తేశ్వరి వాసుపిల్లి ఆవిష్కరించారు. ఈ సంవత్సరం అత్యుత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి విజేతలకి విభూతి ఫ్యాబ్ స్టూడియోస్, తెలంగాణ కెనడా అసోసియేషన్ వారు బహుమతులను అందజేశారు. బతుకమ్మ పండుగకి విచ్చేసిన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలిచిన వారికి ఒక గ్రాము బంగారం బహుమతిగా అందజేశారు.
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసినందుకు టొరంటో తెలుగు ప్రజల్ని అభినందించారు.స్వచ్ఛంద స్వచ్ఛంద సేవకులను, గవర్నింగ్ బోర్డ్ సహకారాలని ఎంతో కొనియాడారు.చివరగా తెలంగాణ కెనడా అసోసియేషన్ స్పాన్సర్లకు మరియు డిన్నర్ పాట్ లాక్ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు - శంకర్ భరద్వాజ పోపూరి, ప్రణీత్ పాలడుగు, శ్రీరంజని కందూరి, ప్రవీణ్ కుమార్ సామల ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు - హరి రావుల్, దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, సంతోష్ గజవాడ, ప్రకాష్ చిట్యాల, కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీనివాస తిరునగరి, అఖిలేష్ బెజ్జంకి, రాజేశ్వర్ ఈధ, వేణుగోపాల్ రోకండ్ల, విజరు కుమార్ తిరుమలపురం పాల్గొన్నారు.


తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







