'జనతా గ్యారేజ్' ట్రైలర్ జులై 6న విడుదల
- June 23, 2016
నాన్నకు ప్రేమతో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. ఇచట అన్నీ రిపేర్లు చేయబడును అనేది క్యాప్షన్. ఈ చిత్ర ఫస్ట్ ట్రైలర్‌ను జులై 6న విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంతో స్టైలిష్ లుక్‌తో ఎన్టీఆర్ ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామేనన్‌లు కథానాయికలుగా నటిస్తుండగా మోహన్‌లాల్, దేవయానిలు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత బాణీలు అందిస్తున్నారు. త్వరలోనే జనతా గ్యారేజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







