అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ముందుకొచ్చింది.
- June 24, 2016
అందరికీ అందుబాటులో, ఆమోదయోగ్యంగా ఉండాలనే అమరావతిని ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కట్టుబట్టలతో హైదరాబాద్‌నుంచి వచ్చిన తెలుగువారికి ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలన్న ఉద్దేశంతోనే అమరావతి నిర్మాణంలో పలు దేశాలను భాగస్వాములను చేసినట్లు స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభాలను దాటుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
విజయవాడలో నాలుగు గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి నగరాన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మించేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ సంస్థలు అసెండా సింగ్‌బ్రిడ్జి, సెమ్‌కార్ట్ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మాణం చేపట్టేందుకు ముందుకొచ్చినట్లు చెప్పారు. అమరావతి డెవలప్మెంట్ కంపెనీ, 2 సింగపూర్ కంపెనీలు కన్సార్టియంతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ముందుకొచ్చిందని... దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారు.
అమరావతి నిర్మాణం కోసం అమరావతి డెవలప్మెంట్ పార్టనర్‌కు 1,691 ఎకరాలు అప్పజెప్పనున్నట్లు తెలిపారు. మూడు ఫేజ్‌లలో రాజధాని భూములు అప్పగిస్తామని... ఫేజ్-1లో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్కు 200 ఎకరాలు ఇస్తామన్నారు
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







