ముగిసిన రఫెల్ నాదల్ శకం..
- November 20, 2024
స్పెయిన్: దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. ఇక పై అతడిని టెన్నిస్ కోర్టులో చూడలేదు. నాదల్ తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేశాడు. తన కెరీర్లో 22 గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న ఈ దిగ్గజ ఆటగాడు ఆఖరి మ్యాచ్‌లో ఓటమితో వీడ్కోలు పలికాడు. డేవిస్ కప్ క్వార్టర్స్ ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ ఓడిపోవడంతో అతడి కెరీర్ ముగిసింది. డేవిస్ కప్‌తో ఆటకు వీడ్కోలు పలుకుతానని అక్టోబర్‌లోనే నాదల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. డేవిస్ కప్‌లో ఓటమితోనే సుదీర్ఘ కెరీర్‌ను ఆరంభించిన నాదల్ పరాజయంతోనే తన కెరీర్‌ను ముగించడం గమనార్హం.
సింగిల్ మ్యాచ్‌లో బోటిక్ వాన్ డి జాండ్స్చుల్ప్ (నెదర్లాండ్స్) చేతిలో నాదల్ 4-6, 4-6 తేడాతో ఓడిపోయాడు. అయితే.. కార్లోస్ అల్కరాజ్ 7-6 (7/0), 6-3తో టాలోన్ గ్రీక్స్పూర్ను ఓడించాడు. దీంతో 1-1తో స్పెయిన్, నెదర్లాండ్స్ సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక డబుల్స్‌లో అల్కారజ్, మార్సెల్ గ్రానోల్లర్స్ ఓడిపోయారు. దీంతో నెదర్లాండ్స్ 2-1 తేడాతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
డబుల్స్ మ్యాచ్‌లో స్పెయిన్ గెలిచి ఉంటే.. సెమీఫైనల్లో నాదల్ ఆటను చూసి ఉండేవాళ్లం. కానీ ఓడిపోవడంతో నాదల్ కెరీర్ ఇక్కడితోనే ముగిసింది.
కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్నాడు నాదల్. ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మూడింట పాల్గొనలేదు. డేవిస్ కప్‌కు ముందు చివరగా పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన నాదల్ నిరాశపరిచాడు. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్, నాలుగు సార్లు యూఎస్ ఓపెన్, రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్లలో ఛాంపియన్‌గా నిలిచాడు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







