జహ్రా, ఫర్వానియా, అహ్మదీలలో 232 మంది అరెస్ట్..!!
- November 21, 2024
కువైట్: జహ్రా, ఫర్వానియా, అహ్మదీ గవర్నరేట్లలో రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ జనరల్ డిపార్ట్మెంట్ విస్తృతమైన భద్రతా తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 232 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 60 మంది రెసిడెన్సీ, వర్క్ చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉండగా, 140 మంది పరారీ కేసులు, అరెస్టు వారెంట్లు జారీ అయిన 14 మంది నివాసితులు, 18 మంది ID రుజువు లేనివారు ఉన్నారని తెలిపారు. ముత్లా, జ్లీబ్ అల్-షుయౌఖ్, హసావి, ఫహాహీల్, మహబూలా ప్రాంతంలో భద్రతా ప్రచారం నిర్వహించారు. నివాస చట్టాన్ని ఉల్లంఘించే వారందరినీ అరెస్టు చేయడానికి దేశవ్యాప్తంగా భద్రతా తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







