నీట్ ఎండీఎస్ 2025 ఎగ్జామ్ ఫుల్ షెడ్యూల్ విడుదల..
- November 27, 2024
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ (NBEMS), నీట్ ఎండీఎస్ 2025 పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ కోర్సు 2025 లేదా నీట్ ఎండీఎస్ 2025 కోసం నీట్ పీజీ వచ్చే జనవరి 31న నిర్వహించనున్నారు.
ఎన్‌బీఈఎమ్ఎస్ త్వరలో నీట్ ఎండీఎస్ 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ (http://natboard.edu.in)లో విడుదల చేస్తుంది. అభ్యర్థులు ఎన్‌బిఇఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షకు సంబంధించిన సమాచార బులెటిన్‌లు, దరఖాస్తు ఫారమ్‌లు, ఇతర వివరాలను పొందవచ్చు. నీట్-ఎండీఎస్ అనేది వివిధ ఎండీఎస్ కోర్సులలో ప్రవేశానికి అర్హత-కమ్-ర్యాంకింగ్ పరీక్షగా చెప్పవచ్చు.
- భారత్‌లో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆల్ ఇండియా 50శాతం కోటా ఎండీఎస్ సీట్లు.
- భారత్‌లో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్ర కోటా సీట్లు.
- దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ డెంటల్ కాలేజీలు, ఇన్‌స్టిట్యూషన్‌లు, యూనివర్సిటీలలో ఎండీఎస్ కోర్సులు
- ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎండీఎస్ కోర్సులు.
- ఆర్మీ డెంటల్ కార్ప్స్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం డెంటల్ సర్జన్స్ (BDS & MDS) కోసం స్క్రీనింగ్ పరీక్ష
నీట్ ఎండీఎస్ 2025: అర్హత ప్రమాణాలు:
మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థి, భారత్‌లోని యూనివర్శిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ ద్వారా గుర్తింపు పొందిన బ్యాచిలర్ ఇన్ డెంటల్ సర్జరీ డిగ్రీని కలిగి ఉండాలి. స్టేట్ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసి, తాత్కాలిక లేదా శాశ్వత రిజిస్ట్రేషన్ పొంది, తప్పనిసరి రొటేటరీ ఇంటర్న్‌షిప్ పొంది ఉండాలి. ఆమోదించిన/గుర్తింపు పొందిన డెంటల్ కాలేజీలో ఒక ఏడాది వరకు చదివి ఉండాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







