'సంక్రాంతికి వస్తున్నాం' ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు రిలీజ్
- December 03, 2024విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'తో అలరించబోతున్నారు. ఇది వారి సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హ్యాట్రిక్ మూవీ. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్లు మేకర్స్ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు సాంగ్ విడుదల చేయడంతో ప్రారంభమయ్యాయి.
గోదారి గట్టు లీడ్ పెయిర్ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ జంటగా అలరించిన రొమాంటిక్ ట్రాక్. భాస్కరభట్ల రచించిన ఈ పాట భార్యాభర్తల మధ్య చిలిపి సరదాలని అందంగా ప్రజెంట్ చేసింది. వారు షేర్ చేసుకునే ఆప్యాయత, ప్రేమను ప్రదర్శిస్తూనే, ఒక బాండింగ్ లో హ్యుమరస్ ఆర్గ్యుమెంట్స్ ని హైలైట్ చేస్తుంది.
ఈ పాట జానపదం టచ్ ని కలిగి ఉంది, భీమ్స్ సిసిరోలియో అద్భుతంగా కంపోజ్ చేశారు. రమణ గోగుల యూనిక్ స్టయిల్ మెలోడీకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. మధు ప్రియ మెస్మరైజ్ చేసే వాయిస్ పాట ఆకర్షణను మరింత పెంచింది.
వెంకటేష్ , ఐశ్వర్య రాజేష్ భార్యభర్తలుగా బ్యూటీఫుల్ కెమిస్ట్రీ షేర్ చేసుకున్నారు. గోదారి గట్టు సాంగ్ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లకు బ్లాక్‌బస్టర్ బిగినింగ్ అందిస్తూ ఆల్బమ్‌లోని తర్వాతి పాటలపై అంచనాలు పెంచింది
షూటింగ్ పూర్తి కావస్తున్న ఈ ట్రైయాంగిల్ క్రైమ్ కథలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా
మార్కెటింగ్: నాని
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







