'తాండవం' బ్రెత్ టేకింగ్ ఫైట్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూట్ ప్రారంభం
- December 12, 2024
నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఇది వారి మునుపటి స్మాష్ హిట్ 'అఖండ' కు ఇది సీక్వెల్, మరింత హై -ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాను ప్రామిస్ చేస్తోంది. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ప్రతిష్టాత్మక 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఘనంగా లాంచ్ అయిన మూవీ, బాలకృష్ణ డే వన్ జాయిన్ కావడంతో 'అఖండ 2' రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. బోయపాటి తనదైన స్టయిల్ లో బ్రెత్ టేకింగ్ ఫైట్ సీక్వెన్స్ తో షూటింగ్‌ను ప్రారంభించారు. ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఈ ఫైట్ సీక్వెన్స్ ని సూపర్ వైజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సీలో షూటింగ్ జరుగుతోంది.
ఈ సందర్భంగా మేకర్స్ లాంఛింగ్ ఈవెంట్ నుంచి గ్రిప్పింగ్ మూమెంట్‌ను ప్రజెంట్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.“ఈ నేల అసురుడిది కాదు రా... ఈశ్వరుడిది... పరమేశ్వరుడిది... కాదని తాకితే జరిగేది తాండవం... అఖండ తాండవం. .." అంటూ పవర్ ఫుల్ డైలాగ్‌ని చెప్పారు బాలకృష్ణ.
థమన్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ద్వారా సీన్ ఇంటన్సిటీ మరింత పెంచింది, మ్యూజిక్ ఎడిషినల్ ఎనర్జీ, ఎక్సయిట్మెంట్ ని యాడ్ చేసింది. దసరాకి సెప్టెంబర్ 25, 2025న సినిమా విడుదలవుతుందని వీడియో ద్వారా రివిల్ చేశారు.
ఈ చిత్రంలో స్టార్ తారాగణం ఉంది, మిగతా నటీనటులను త్వరలో రివిల్ చేయనున్నారు. ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు వున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ 2 ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్, సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్‌తో సహా అత్యున్నత సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరికీ మేడిన్ పాన్ ఇండియా మూవీ'అఖండ 2 'ఇండియా అంతటా విడుదల కానుంది.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: సి. రాంప్రసాద్, సంతోష్ D Detakae
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







