బిగ్ టికెట్ డ్రా ప్రైజ్.. Dh1 మిలియన్ గెలుచుకున్న వ్యాపారవేత్త..!!
- December 14, 2024
యూఏఈ: బిగ్ టికెట్ డ్రా ప్రైజ్ డ్రాలో బంగ్లాదేశ్‌కు చెందిన విజేత 1 మిలియన్ దిర్హామ్‌ల ప్రైజ్‌ని సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియాకు చెందిన రూబెల్ అనే వ్యాపారవేత్త, 2020 నుండి బిగ్ టిక్కెట్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అతను అబుదాబిని సందర్శించి, బిగ్ టికెట్ స్టాల్‌ను చూసినప్పటి నుండి టిక్కెట్లను క్రమం తప్పకుండా కొనుగొలు చేస్తున్నాడు. "ఇది నా మొట్టమొదటి రాఫిల్ విజయం. నేను బహుమతి డబ్బును ఎలా ఉపయోగించాలో ఇంకా నిర్ణయించుకోలేదు."అని 36 ఏళ్ల విజేత అన్నాడు. గెలిచిన తర్వాత కూడా ఈ డ్రాల్లో పాల్గొంటానని రూబెల్ తెలిపారు. ఈ నెలలో ప్రతి టిక్కెట్ కొనుగోలు పాల్గొనేవారికి రాబోయే లైవ్ డ్రాలో 30 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకునే అవకాశాన్ని ఇస్తుంది. అయితే 1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకునే అవకాశం కోసం పార్టిసిపెంట్ను వీక్లీ డ్రా నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







