'ఓదెల 2' నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్
- December 21, 2024
తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2', ఇది 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. నాగ సాధు పాత్రలో తమన్నా పెరోషియస్, స్టన్నింగ్ పోస్టర్స్ క్యురియాసిటీని పెంచాయి.
తమన్నా భాటియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓదెల2 నిర్మాతలు తమన్నాను తన పెరోషియస్ నాగ సాధు అవతార్‌లో ప్రజెంట్ చేస్తూ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో ఆమె పుర్రెలపై ధైర్యంగా నడుస్తున్నట్లు కనిపించారు, రాబందులు పైన ఎగురడం టెర్రిఫిక్ గా వుంది. ఈ అద్భుతమైన పోస్టర్ చిత్రంలో ఆమె పాత్ర ఇంటెన్స్ అండ్ పవర్ ఫుల్ నేచర్ ని సూచిస్తున్నాయి.
ప్రేక్షకులను అలరించే బ్రెత్ టేకింగ్ స్టంట్స్ ని పెర్ఫామ్ చేయడానికి తమన్నా భాటియా తన పాత్ర కోసం ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు.
ఓదెల2 భారీ బడ్జెట్, హై క్యాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వబోతోంది.
ఎంగేజింగ్ కథనాలతో థ్రిల్లింగ్ యాక్షన్‌ను బ్లెండ్ చేయడంలో పాపులరైన సంపత్ నంది ఈ చిత్రాన్ని సూపర్ విజన్ చేస్తున్నారు. ఒదెల 2కి కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ డీవోపీ సౌందర్‌రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. ఆర్ట్ డైరెక్షన్ రాజీవ్ నాయర్. డైనమిక్ టెక్నికల్ టీమ్‌తో ఓదెల 2 ఒక మరపురాని సినీ ప్రయాణంగా రూపొందుతోంది.
తారాగణం: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి మధు
క్రియేటెడ్ బై: సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
డీవోపీ: సౌందర్ రాజన్ S
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







