సుమంత్ ప్రభాస్, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నెం1 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
- December 22, 2024
తన తొలి మూవీ ‘మేం ఫేమస్’తో లీడ్ యాక్టర్, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా తన రెండో మూవీతో రాబోతున్నారు.ఈ కొత్త మూవీ రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ మేడిన్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ షెడ్యూల్‌ని రేలంగి, వేల్పూరి, భీమవరంలోని బ్యూటీఫుల్ లోకేషన్స్ లో షూట్ చేశారు.
ఈ యూత్‌ఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ బిగ్ స్క్రీన్స్ కు సరికొత్త ఎక్స్ పీరియన్స్ తీసుకువస్తుంది.
ఈ చిత్రంతో నిధి ప్రదీప్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. జగపతి బాబు మేజర్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రీను & రోహిత్ కృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సాయి సంతోష్ సినిమాటోగ్రఫీని, నాగ వంశీ కృష్ణ సంగీతం అందిస్తున్నారు, ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య, ఎడిటర్ అనిల్ కుమార్ పి.
నటీనటులు: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రీను, రోహిత్ కృష్ణ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం – సుభాష్ చంద్ర
బ్యానర్ – రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
డీవోపీ – సాయి సంతోష్
సంగీతం – నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ – అనిల్ కుమార్ పి
ప్రొడక్షన్ డిజైనర్ – ప్రవల్య
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మధులిక సంచన లంక
పీఆర్వో – వంశీ-శేఖర్
మార్కెటింగ్ – ఫస్ట్ షో
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







