లాస్ ఏంజెల్స్‌లో కొనసాగుతున్న మంటలు
- January 13, 2025
అమెరికా: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మంటలు అదుపులోకి రావడం లేదు. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తున్నది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మంటలు అదుపులోకి రావడం లేదు. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తున్నది. ప్రాణనష్టం సైతం పెరుగుతున్నది. శనివారం రాత్రికి మృతుల సంఖ్య 16కు పెరిగినట్టు అధికారులు తెలిపారు.
పాలిసేడ్స్, ఏటన్, కెన్నెత్, హర్ట్‌లో దాదాపు 62 చదరపు మైళ్ల మేర మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు కాలిఫోర్నియాతో పాటు అమెరికాలోని తొమ్మిది నగరాలు, మెక్సికోకు చెందిన అగ్నిమాపక బృందాలు పని చేస్తున్నాయి. కాగా, లాస్ ఏంజెల్స్‌లో నివసించే హాలీవుడ్ నటులు వారికి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వినియోగించుకున్నారని, దీంతో ఇప్పుడు మంటలు ఆర్పేందుకు నీటి కొరత ఏర్పడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కమలా హారిస్ ఇంటికీ ముప్పు
కార్చిచ్చు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం పాలిసేడ్స్ అగ్ని బ్రెంట్వుడ్ వైపు మళ్లింది. ఈ ప్రాంతంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు పలువురు క్రీడాకారులు, నటీనటుల ఇండ్లు ఉన్నాయి. దీంతో ఉపాధ్యక్షురాలి హోదాలో చేయాల్సిన తన చివరి విదేశీ పర్యటనను కమలా హారిస్ రద్దు చేసుకున్నారు. మరోవైపు అమెరికాలోని టెక్సాస్, ఓక్లహోమా, మరికొన్ని రాష్ర్టాలను మంచు తుఫాను అతలాకుతలం చేస్తున్నది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







