'ది ప్యారడైజ్' కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్
- February 02, 2025
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరి 'దసరా' బ్లాక్ బస్టర్ విజయం తర్వాత 'ది ప్యారడైజ్' కోసం కొలాబరేట్ అయ్యారు. ఈ కొత్త చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. నాని కూడా తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్ గా జిమ్ చేస్తున్నారు.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించడం ఖాయమైయింది. జెర్సీ, గ్యాంగ్‌లీడర్ హిట్స్ తర్వాత నాని, అనిరుధ్ కలిసి పనిచేస్తున్న మూడవ చిత్రం ఇది. గత రెండు సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి, అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం అంచనాలు భారీగా వున్నాయి.
“మేము మా హ్యాట్రిక్ పై ఉన్నాము:) ఇది ఒక అద్భుతం అవుతుంది. #Paradise ఇప్పుడు N’Ani’Odela సినిమా. స్వాగతం, డియర్ @anirudhofficial ♥️” అని నాని పోస్ట్ చేశారు
“ఇది చాలా స్పెషల్. మై డియర్ @NameisNani, @odela_srikanth 💥💥💥వెర్రిగా పోదాం ⚡️⚡️⚡️” అని అనిరుద్ పోస్ట్ చేశారు.
శ్రీకాంత్ ఓడెలా పవర్ ఫుల్ లార్జర్ దెన్ లైఫ్ కథను ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు,ఇది నానిని పూర్తిగా కొత్త, మాస్-డ్రైవ్ అవతార్‌లో ప్రజెంట్ చేయనుంది.
నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా స్కేల్ లో నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఇప్పటివరకు నాని యొక్క మోస్ట్ హై బడ్జెట్ వెంచర్.
మిగిలిన నటీనటులు,సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.
తారాగణం: నాని
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







