ప్రేమికుల దినోత్సవం...!
- February 14, 2025
ప్రేమ.. విశ్వవ్యాప్తమైంది.భూమ్మీద ఏ మూలకు వెళ్లినా..ప్రేమికులు కనిపిస్తారు. ‘ప్రేమికుల దినోత్సవం’ జరుపుకొంటారు. కానీ, ప్రాంతాన్ని, పద్ధతులను బట్టి.. వేర్వేరుగా సెలెబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు.
అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. భారత్‌లోనూ గతంలో జరిగినా.. పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే వేడుకలు కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.. ఆ రోజు జంటలుగా రోడ్లపై కనపడినవారికి బలవంతంగా పెళ్లిళ్లు జరిపించిన సందర్భాలు కూడా లేకపోలేదు..
అయితే, రానురాను.. ప్రేమికుల దినోత్సవం స్వరూపాన్ని మార్చుకుంటుంది.. ప్రేమికుల రోజున.. ఓయో రూమ్స్‌కి మంచి వ్యాపారం పెరగడం.. ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో కండోమ్ అమ్మకాలు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయంటే.. ప్రేమికుల దినోత్సవం పేరుతో ఏం జరుగుతుందో.. ఇక, ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదేమే.. అయితే, ఆ చర్చ తర్వాత.. కానీ, అసలు ప్రేమికుల దినోత్సవం ఎలా పుట్టింది..? సెయింట్ వాలెంటైన్ ఎవరు? ఎవరి జ్ఞాపకార్థం ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు? అనే వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
ఫిబ్రవరి 7న, ప్రేమికుల వారం రోజ్ డేతో ప్రారంభమవుతుంది, దీనిని వాలెంటైన్స్ వీక్ అని పిలుస్తారు. ఈ క్రమంలో, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, చివరకు వాలెంటైన్స్ డేను ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు. వీటన్నింటిలో, వాలెంటైన్స్ డే అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది, దీనిని చాలా దేశాలలో చాలా ప్రత్యేకమైన రీతిలో జరుపుకుంటారు.
వాలెంటైన్ అనే ఒక ప్రవక్త. ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. క్రీ .శ.పూ. 270లో రోమ్ దేశంలో జీవించిన వాలెంటైన్.. యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు.. ఇక,, అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె వాలెంటైన్ అభిమానిగా మారిపోతుంది.. దీంతో, ఆ చక్రవర్తికి భయం పట్టుకుంది. యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో.. వాలెంటైన్‌కు మరణశిక్ష విధిస్తారు.. ఆ తర్వాత ఫిబ్రవరి 14వ తేదీన ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వాలెంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు.
సెయింట్ వాలెంటైన్ ప్రేమ బోధకుడు, కాబట్టి ప్రపంచానికి ప్రేమ సందేశాన్ని ఇవ్వడానికి ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడని కొందరి విశ్వసించారు. అందువల్ల, ఫిబ్రవరి 14ని ప్రేమికుల దినోత్సవంగా (వాలెంటైన్స్ డే) జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ రోజు నుండి, రోమ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.
వాలెంటైన్స్ డే అనగానే అంతా తమ ప్రేమను ప్రియుడు లేదంటే ప్రియురాలితో పంచుకుంటారు. గిఫ్టులు, గ్రీటింగ్ కార్డులు, సినిమాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని ప్లాన్స్ వేసుకుంటారు. ప్రేమను తెలిపేందుకు ఎన్నో వెరైటీ గిఫ్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రియమైనవాళ్లు జీవితాంతం గుర్తుండిపోయేలా ఇచ్చే బహుమతులను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే.. వాళ్ల మనసు దోచుకోవచ్చు.
ప్రేమికుల రోజన ప్రియమైన వాళ్లకి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది' అని తెగ ఆలోచించేస్తాం. బోలెడన్ని షాపులు తిరిగేస్తాం. ఇది అందరూ చేసే పనే. ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇచ్చే ప్రేమ గిఫ్ట్ ల లిస్టులో ఫస్ట్ ప్లేస్ నగలదే! ఆ తర్వాత గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, పువ్వులను ఎక్కువ మంది ఇచ్చి పుచ్చుకుంటున్నారు. మన దేశంలో కూడా ఈ బహుమతుల లిస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక, గిఫ్ట్ ఏదైనాకానీ.. అందులో ప్రేమను ప్రతిబింబించే హార్ట్' షేప్ తప్పసరి అని ఒక సర్వే ద్వారా తెలిసింది.
ప్రేమికుల రోజున నూటికి తొంభై మంది ఇచ్చే బహుమతుల్లో తప్పనిసరిగా ఉండేవి ఏమిటో తెలుసా? పువ్వులు.. ప్రత్యేకించి ప్రేమకు గుర్తుగా భావించే గులాబీలు, వాటితో పాటు వేరే గిఫ్ట్ లు కూడా చాలామంది ఇస్తుంటారు. అయితే, ఈసారి వాటిని మించిన గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. హార్ట్ షేప్ బొమ్మలాంటివి ఇప్పుడు బాగా ఓల్డ్ ఫ్యాషన్ అయ్యాయి. కాబట్టి కొత్తగా ఏదైనా ట్రై చేసి.. మీ పార్ట్నర్ని సర్ప్రైజ్ చేయండి.
వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులు మార్కెట్లో గుట్టలు గుట్టలుగా దొరుకుతాయి. వాటిలో ఉండే కొటేషన్లు కూడా బాగుంటాయి కానీ, అవి మీ సొంత పీలింగ్స్ కావు కదా. కాబట్టి మీరేం అనుకుంటున్నారో పేపర్ మీద పెట్టి గ్రీటింగ్ తయారు చేసి ఇవ్వండి. అయితే, అతిగా ఇంప్రెస్ చెయ్యడానికి లేనిపోనివి రాయొద్దు. ప్రేమలో నిజాయతీగా ఉండటం ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. మీ గిఫ్ట్ ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్స్ కు ఇచ్చే వైతే.. వాళ్లు అవమానపడేలా, సిగ్గుపడేలా, బాధపడేలా ఉండకూడదు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్‌లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్‌లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









