22 ఏళ్ళ జిహాదీ బ్రైడ్ మేకర్ తుబా గొండాల్
- July 03, 2016
ఆమె అందమైనదే.. కానీ ఆ అందం వెనక క్రూరత్వం దాగుంది.. రక్తపాతం జరగాలన్న ఉన్మాదం ఉంది. ఆ అమ్మాయి పేరు తుబా గొండాల్.. వయస్సు జస్ట్ 22 ఏళ్ళు మాత్రమే. చదువు, ఉద్యోగాల మాట పక్కన బెట్టి జిహాదీ బ్రైడ్ మేకర్‌గా మారిపోయింది. అంటే బ్రిటన్‌లోని ముస్లిం యువతులను సిరియాకు వచ్చి యువకులైన జిహాదీలను పెళ్లి చేసుకోవాలని కోరుతోంది.
ఆన్‌లైన్‌లో వాళ్లకు ఇలా గాలం వేస్తున్న తుబా.. సూసైడ్ బాంబింగ్‌లో అమరురాలై పోవాలన్నదే తన ఆశయమని చెబుతోంది. లండన్‌లోనే చదువుకున్నప్పటికీ బ్రిటన్‌ను శత్రు దేశంగా పరిగణిస్తున్న ఈమె.. ఉగ్రవాదులు దేశ భక్తులని అభివర్ణిస్తోంది. ఏడాది కాలంగా సిరియాలోని రక్కా నగరంలో ఉంటున్న ఈమె సదా ఇంటర్నెట్‌లో బ్రిటన్‌లోని అందమైన ముస్లిం అమ్మాయిలను తనలా జిహాదీగా మారిపోవాలని, ఇక్కడ మీకు అన్ని సుఖాలూ లభిస్తాయని ప్రోత్సహించడం విశేషం. బ్రిటన్‌లో ఒకప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకుందామని ఎన్నోసార్లు ప్రయత్నించా.. కానీ అధికారులు నాకు లైసెన్స్ మంజూరు చేయలేదు.
కానీ సిరియాలో ఇప్పుడు వాహనాలను హాయిగా డ్రైవ్ చేయగలుగుతున్నా.. నాకు సులభంగా లైసెన్స్ లభించింది అని తుబా అంటోంది. ప్యారిస్‌ను తగులబెట్టండి అని స్లోగన్ ఇస్తున్న ఈ యువతిలాంటి వాళ్ళు ఇంకా సిరియాలో చాలామందే ఉన్నారని బ్రిటన్ ప్రభుత్వ అంచనా.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







