వాట్సాప్‌లో వండర్ఫుల్ ఫీచర్.. మీ ప్రైవసీ ఇక మీ చేతుల్లో..
- March 01, 2025
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది. ఆ ఫీచర్లను ఫస్ట్ బీటా వెర్షన్లో టెస్టింగ్ చేస్తారు. తాజాగా మరో కొత్త ఫీచర్ రాబోతుంది.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ డెవలప్మెంట్ మోడ్‌లో ఉంది. కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రొఫైల్ లింక్ ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వాట్సాప్ ఫీచర్లు, అప్డేట్లను అందించే ప్లాట్‌ఫామ్ (WABetaInfo) యాప్.. త్వరలో కొత్త ప్రైవసీ ఫీచర్ అందరికి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్‌లో రిలీజ్ అయిన ఆండ్రాయిడ్ 2.25.5.19 వాట్సాప్ బీటా వెర్షన్ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ ప్రైవసీ సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చునని వెల్లడించింది. ఈ ఫీచర్‌కు సంబంధించిన నాలుగు ఆప్షన్లు యూజర్లకు అందుబాటులో ఉంటాయి.
ఇలా 4 ఆప్షన్లతో ఎంచుకోవచ్చు:
నివేదికలో స్క్రీన్‌షాట్ ప్రకారం.. వాట్సాప్ యూజర్లందరికి తమ ప్రొఫైల్ లింక్ విజబిలిటీని ఎంచుకునేందుకు వీలుంటుంది. అంటే.. వినియోగదారులు తమ ప్రొఫైల్‌తో లింక్ చేసిన సోషల్ మీడియా లింక్‌లను ఎవరు చూడొచ్చు? ఎవరు చూడకూడదనే దానిపై పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఈ విజబిలిటీని ఎంచుకునేందుకు మొత్తం 4 ఆప్షన్లు ఉంటాయి. ఈ జాబితాలో ‘EveryOne’, ‘My Contacts’, ‘My Contacts Except, Nobody’ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
మీరు ప్రొఫైల్ లింక్‌ను అందరితో షేర్ చేసుకోవచ్చు. మీ సోషల్ మీడియా అకౌంట్లను యాక్సెస్ చేయగలరు. ఈ ఫీచర్ ద్వారా సోషల్ మీడియా అకౌంట్ల పరిధిని పెంచుకోవాలనే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
అలాగే, మీ సోషల్ లింక్‌లను ప్రొఫైల్ ద్వారా షేర్ చేసేందుకు వీలుంటుంది. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ మోడ్‌లో ఉంది. వాట్సాప్ యూజర్లందరిని చేరుకోవడానికి కొన్ని వారాలు పట్టవచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లోని అందరికీ అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







