వీర ధీర సూరన్ పార్ట్ 2 నుంచి లవ్ సాంగ్ కళ్లల్లో రిలీజ్
- March 11, 2025
చియాన్ విక్రమ్ మోఎస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర సూరన్ పార్ట్ 2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ వంటి అద్భుతమైన నటులు ఉన్నారు.
H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన 'వీర ధీర సూరన్ పార్ట్ 2' ఒక యాక్షన్ థ్రిల్లర్, ఇది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇప్పటికే రీలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ కళ్లల్లో సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు.
శరత్ సంతోష్, రేష్మ శ్యామ్ తమ ప్లజెంట్ వోకల్స్ మెలోడీ అండ్ గ్రేస్ ని మరింత ఎలివేట్ చేశారు. రాజేష్ గోపిశెట్టి రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. ఈ సాంగ్ లో విక్రమ్, దుషార విజయన్ కెమిస్ట్రీ చాలా నేచురల్ గా వుంది. ఈ లవ్ ట్రాక్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జి.కె. ప్రసన్న ఎడిటింగ్ వర్క్ పర్యవేక్షిస్తున్నారు. సి.ఎస్. బాలచందర్ ఆర్ట్ డైరెక్టర్.
చియాన్ విక్రమ్-దర్శకుడు S.U. అరుణ్ కుమార్-నిర్మాత రియా శిబుల అద్భుతమైన అద్భుతమైన కొలాబరేషన్ లో వస్తున్న వీర ధీర సూరన్ పార్ట్ 2 పై ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులలో చాలా అంచనాలు వున్నాయి. తెలుగులో ఎన్విఆర్ సినిమాస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ చిత్రం మార్చి 27, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..







