23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- March 09, 2026
రియాద్: సౌదీ అరేబియా వ్యాప్తంగా రమదాన్ మూడవ వారంలో ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) 119,819 తనిఖీలు నిర్వహించింది. 23,399 ఉల్లంఘనలను గుర్తించి 1,199 వాహనాలను జప్తు చేసింది.
యాత్రికులకు సురక్షితమైన రవాణాను నిర్ధారించడానికి మక్కా మరియు మదీనా ప్రాంతాలలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపింది. మక్కా ప్రాంతంలో 66,166 తనిఖీలు నిర్వహించి, 13,993 ఉల్లంఘనలు నమోదు చేసి 694 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అలాగే, మదీనా ప్రాంతంలో, 18,843 తనిఖీలు చేపట్టి 4,627 ఉల్లంఘనలు నమోదు చేయడం ద్వారా 404 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
డ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం, పర్మిట్లు లేకుండా నడపడం, అన్ ఫిట్ వాహనాలు, టాక్సీ మీటర్లలో ట్యాంపరింగ్ వంటి సాధారణ ఉల్లంఘనలు అధికంగా ఉన్నాయని అథారిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







