పాంచ్ మినార్’ నుంచి 'ఏం బతుకురా నాది' సాంగ్ రిలీజ్
- March 17, 2025
యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ సినిమా ఫస్ట్ సింగిల్ మిడిల్ క్లాస్ ఆంథమ్ 'ఏం బతుకురా నాది' సాంగ్ రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర ఈ సాంగ్ ని క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేశారు. దినేష్ రుద్ర ఈ పాటని పాడిన స్టయిల్ ఎట్రాక్టివ్ గా వుంది.
హీరో క్యారెక్టర్ ని ప్రజెంట్ చేస్తూ అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సాంగ్ లో రాజ్ తరుణ్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. అందరినీ కనెక్ట్ అయిన ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆదిత్య జవ్వాది డీవోపీ కాగా ప్రవీణ్ పూడి ఎడిటర్. ‘బేబీ’ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలు
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: కనెక్ట్ మూవీస్ LLP
సమర్పణ: గోవింద రాజు
రచన & దర్శకత్వం: రామ్ కడుముల
నిర్మాతలు: మాధవి, MSM రెడ్డి
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: ఆదిత్య జవ్వాది
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరెక్టర్: ‘బేబీ’ సురేష్ భీమగాని
డైలాగ్స్: గొరిజాల సుధాకర్
కో-డైరెక్టర్స్: పుల్లారావు కొప్పినీడి & టి రాజా రమేష్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







