కొత్త బేబీ గర్ల్ ను స్వాగతించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్..!!
- March 22, 2025
యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కొత్త బేబీ గర్ల్ ను స్వాగతించారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు. అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఫిబ్రవరి 25, 2023న, షేక్ హమ్దాన్ తన మూడవ బిడ్డ మొహమ్మద్ బిన్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ జన్మించడాన్ని ప్రకటించారు. అంతకుముందు మే 20, 2021న కవలలు షేఖా, రషీద్ జన్మించిన విషయం తెలిసింది.
మార్చి నెల ప్రారంభంలో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ కూడా షేక్ జాయెద్ బిన్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అతని భార్య షేఖా ఫాతిమా బింట్ సురూర్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్ మగబిడ్డను స్వాగతించారు. 2008లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు నవజాత శిశువుతో సహా నలుగురు పిల్లలు( ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు) ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







