రాఫిల్ డ్రా కుంభకోణం.. నెట్ వర్క్ ను ఛేదించిన అధికారులు..!!

- March 25, 2025 , by Maagulf
రాఫిల్ డ్రా కుంభకోణం.. నెట్ వర్క్ ను ఛేదించిన అధికారులు..!!

కువైట్: కువైట్ లో సంచలనం సృష్టించిన రాఫిల్ డ్రా కుంభకోణం కీలక మలుపు తిరిగింది. రాఫిల్ డ్రా కుంభకోణం వెనుక ఉన్న ఒక నెట్‌వర్క్‌ను ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు ఈజిప్షియన్ మహిళ, ఆమె భర్త 2023 నుండి వివిధ రాఫిల్‌లలో 7 వాహనాలను గెలుచుకున్నట్టు అధికారులు గుర్తించారు. 

ప్రధాన నిందితురాలు అల్-నజాత్ ఛారిటీ కమిటీ ఉద్యోగి. ఈజిప్షియన్ ప్రవాసిని ఫాతిమా గమల్ సాద్ దియాబ్, బాబ్ అల్-కువైట్ ప్రెస్ కంపెనీ ఉద్యోగి అయిన ఆమె భర్త ముహమ్మద్ అబ్దుల్ సలాం ముహమ్మద్ అల్-ఘరబ్లి ఆదివారం సాయంత్రం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశం విడిచి పారిపోయే ప్రయత్నంలో ఉండగా అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని రాఫిల్ విభాగ అధిపతిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

అధికారిక నివేదికల ప్రకారం.. ఈ మోసపూరిత కార్యకలాపాలు 2023లో ప్రారంభమయ్యాయి. ఈ నెట్‌వర్క్‌లో భారతీయులు, ఆసియన్లు, ఈజిప్షియన్లు, స్థానిక పౌరులు సహా మరింత మంది వ్యక్తులు ఉన్నారని గుర్తించారు. ఈ డ్రాలో  ఇప్పటివరకు ఏడు కార్లను ప్రదానం చేశారు. ఈ కేసులో నిందితులపై మోసం, ఫోర్జరీ, మనీలాండరింగ్, కువైట్ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించడం వంటి అనేక అభియోగాలను నమోదు చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com