తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- March 14, 2026
చెన్నై: భారతీయ సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే జ్ఞానపీఠ్ అవార్డు ఈ ఏడాది తమిళ కవి ఆర్. వైరముత్తును వరించింది. 2025 సంవత్సరానికి గాను (60వ జ్ఞానపీఠ్) ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు శనివారం (మార్చి 14) భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ రచయిత్రి ప్రతిభా రే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వైరముత్తు పేరును ఖరారు చేసింది.
వైరముత్తు తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. ఏడుసార్లు ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను 2003లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన రాసిన ‘కళ్ళికాట్టు ఇతిహాసం’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్‌న్యూస్
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్‌లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్‌లో అల్ అమెరికాత్ ఓవర్‌పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







