ఎస్‌బీఐలో ఉద్యోగాలు..

- March 25, 2025 , by Maagulf
ఎస్‌బీఐలో ఉద్యోగాలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేయాలనుకుంటున్నారా? ఎఫ్ఎల్‌సీ కౌన్సెలర్లు, ఎఫ్‌ఎల్‌సీ డైరెక్టర్ల పోస్టుల కోసం ఎస్‌బీఐ దరఖాస్తులు స్వీకరిస్తోంది. 269 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న వారు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మార్చి 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరు అర్హులు?
ఎస్‌బీఐ ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నుంచి రిటైర్డ్ అధికారులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 60 – 63 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు కూడా ఎటువంటి సడలింపు లేదు.

ఎఫ్‌ఎల్‌ కౌన్సెలర్ల జాబ్స్‌ కోసం స్కేల్ I నుండి SMGS IV వరకు అర్హత కలిగిన రిటైర్డ్ సిబ్బంది అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు తక్కువగా వస్తే ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల నుంచి రిటైర్డ్ క్లరికల్ సిబ్బందిని కూడా తీసుకునే అవకాశం ఉంది.

ఇక, ఎఫ్‌బీఐ, ఈ-ఏబీ, పీఎస్‌బీ, ఆర్‌ఆర్‌బీ నుంచి స్కేల్ III, IV ర్యాంకులలో పదవీ విరమణ చేసిన అధికారులు మాత్రమే ఎఫ్ఎల్‌సీ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపికైన అభ్యర్థులు కనీసం ఒక సంవత్సరం, గరిష్ఠంగా మూడు సంవత్సరాలు లేదా వారికి 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పనిచేయవచ్చు. ఒప్పందం రెండు సంవత్సరాలు ఉంటుంది. పనితీరు ఆధారంగా ఒక సంవత్సరం పొడిగిస్తారు.

వేతనం
క్లరికల్ సిబ్బందికి – రూ. 30,000
జేఎంజీఎస్‌-I – రూ. 40,000
ఎంఎంజీఎస్‌-II, ఎంఎంజీఎస్‌-III – రూ. 45,000
ఎస్‌ఎంజీఎస్‌-IV – రూ. 50,000

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com