తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం..!
- March 26, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈరోజు అసెంబ్లీ కమిటీని హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిస్కో బృందం సమావేశం నిర్వహించింది. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వంతో సిస్కో సీఎం సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పీటర్ మాలినాస్కస్ ఎంపీ బృందంతో తెలంగాణ శాసనసభ కమిటీ హాల్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా హై కమిషనర్ టు ఇండియా ఫిలిప్ గ్రీన్ కూడా పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వంతోను సిస్కో ఒప్పందం
అయితే సిస్కో ఉన్నత ఉద్యోగి అయిన ఇప్పాల రవీంద్రారెడ్డి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయన గురించి పూర్తి సమాచారం వెల్లడి కావడంతో ఆయనను సీఎం రేవంత్ తో కలిసే టీం నుంచి తప్పించినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు మంగళవారం ఏపీ ప్రభుత్వంతో సిస్కో ఒప్పందం చేసుకుంది. నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. సిస్కో సౌత్ ఇండియా టెరిటరీ అకౌంట్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల రవీంద్ర కూడా సమావేశానికి హాజరయ్యారు.
సిస్కోలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి
కానీ ఆయనే ఇప్పాల రవీంద్ర అని వీడియోలు రిలీజ్ అయ్యే వరకూ అధికార వర్గాల్లో ఎవరికీ తెలియదని అంటున్నారు. తెలిసిన తర్వాత టీడీపీ సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయి. సిస్కోలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత చీప్ గా సోషల్ మీడియా పోస్టులు పెడతారా అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయన గురించి సిస్కో టీమ్ కు సమాచారం ఇచ్చారు. మరోసారి ఏపీకి సంబందించిన ఎలాంటి విషయాల్లోనూ ఆయనను ఇన్వాల్వ్ చేయవద్దని స్పష్టం చేశారు. ఇప్పాల రవీంద్రారెడ్డి 2017లో సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయ్యారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!