సినిమా రివ్యూ: ‘రాబిన్ హుడ్’.!

- March 28, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘రాబిన్ హుడ్’.!

నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ‘రాబిన్ హుడ్’. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ సినిమా పెద్ద హిట్. అదే ఫార్ములాని అప్లై చేస్తూ తాజాగా ‘రాబిన్ హుడ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్లు, ట్రైలర్లు చూస్తే అర్ధమయ్యింది. మరి, సినిమా ఎలా వుందో తెలియాలంటే ముందుగా కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
చిన్నతనం నుంచీ అనాధాశ్రమంలో పెరుగుతాడు రామ్ (నితిన్). ఫండ్స్ లేక తనతో పాటూ తోటి పిల్లలు ఆకలికి అలమటించడం చూసి బాధపడుతుంటాడు. ఆ పరిస్థితి లేకుండా చేయాలని రాబిన్ హుడ్ అవతారమెత్తుతాడు. ధనవంతుల నుంచి డబ్బు దోచుకుని తన అనాధాశ్రమంతో పాటూ చాలా అనాధాశ్రమాలకు దోచుకున్న డబ్బును పంచుతుంటాడు. ఒకానోక టైమ్‌లో పోలీసుల నిఘా పెరగడంతో కొన్ని రోజులు దొంగతనాలకు బ్రేక్ ఇవ్వాలని సెక్యూరిటీ సంస్థలో వుద్యోగానికి కుదురుతాడు. అలా ఆస్ట్రేలియాలో సెటిలైన వాసుదేవ్  (సిజ్జు)  నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకి వస్తుందని తెలిసి ఆమెకి సెక్యూరిటీగా కుదురుతాడు. ఆ లోపు నీరా ప్రాణాలకి ముప్పు వుందని తెలుస్తుంది. మరి, రాబిన్ హుడ్ నీరాని కాపాడుతాడా.? తన దొంగతనాల్ని పోలీసులకు దొరకకుండా కంటిన్యూ చేస్తాడా.? డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ (డేవిడ్ వార్నర్) కథేంటీ.? గంజాయి వ్యాపారి అయిన  సామి ( నాగి దేవదత్త)తో రామ్‌కి లింకేంటీ.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే ‘రాబిన్ హుడ్’ ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
రాబిన్ హుడ్ తరహా పాత్రల్లో ఇప్పటికే చాలా మంది హీరోలు నటించారు. ఈ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు చాలా వరకూ సక్సెస్ అయిన సంగతి కూడా తెలిసిందే. కానీ, నితిన్‌కి ఈ పాత్ర ఇదే తొలిసారి. కానీ, ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. తనదైన ప్లానింగ్స్‌తో దొంగతనాలు చేసే రాబిన్ హుడ్ పాత్రలో నితిన్ వందకు వంద శాతం న్యాయం చేశాడు. లుక్స్ బాగున్నాయ్. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. అలాగే తనదైన కామెడీ టైమింగ్ కూడా కేక పుట్టించాడు. హీరోయిన్ శ్రీలీలకు ఎప్పటిలాగే, పెద్దగా స్కోపున్న పాత్ర దక్కలేదు కానీ, కామెడీ బేస్ చేసుకుని ఆమెపై వేసిన పంచ్ డైలాగులు ఈ సినిమాలో బాగా పండాయని చెప్పొచ్చు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్సెల కిషోర్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయ్. విలన్ నాగీ దేవదత్త పాత్రను మొదట్లో స్ట్రాంగ్‌గా చూపించారు. కానీ, చివరికి వచ్చేసరికి బకరా అయిపోయాడు. విలన్ పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా వుంటే, హీరో పాత్రకి అంత ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఆ చిన్న లాజిక్ డైరెక్టర్ ఈ సినిమాలో మిస్ అయ్యాడనిూపిస్తుంది. ఒకే టెంపో చివరి వరకూ మెయింటైన్ చేయలేకపోయాడు. మరో సర్‌ప్రైజింగ్  ఎలిమెంట్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ వైపు కామెడీ పుట్టిస్తూనే, నెగిటివ్ షేడ్స్ కూడా చూపించాడు. కానీ, ఇంకాస్త ఎక్కువగా డేవిడ్‌ పాత్రని వాడి వుంటే బాగుండేదనిపిస్తుంది. ‘అదిదా సర్‌ప్రైజూ..’ అంటూ సాగే పాటలో కేతిక శర్మ బాగుంది. కానీ, రిలీజ్వి‌కి ముందు వివాదాస్పదమైన హుక్ స్టెప్స్ సినిమాలో లేపేశారు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
‘ఛలో’, ‘భీష్మ’‌తో  ఆల్రెడీ రెండు హిట్లు కొట్టి హ్యాట్రిక్ ఆలోచనతో వున్న వెంకీ కుడుముల ఈ సినిమా కోసం రాసుకున్న కథ అయితే బాగుంటుంది. కానీ, కథనాన్ని ఇంకాస్త ఇంప్రెసివ్‌గా నడిపించి వుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వస్తున్నాయ్. తొలి సినిమాలూ హిట్ అయ్యేందుకు మెయిన్ ఆయుధాలు ఎంటర్‌టైన్‌మెంట్.. చివరి వరకూ ఆ ఫార్ములానే ఫాలో అయ్యాడు ఆ రెండు సినిమాల్లో. కానీ, ‘రాబిన్ హుడ్’లో ఫస్టాఫ్ వున్నంత హిలేరియస్‌గా సెకండాఫ్ వుండదు. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలూ, ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా ఎపిసోడ్ కథకి కనెక్ట్ కాదు. అలాగే మరిన్ని సన్నివేశాలూ కథని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాయనిపిస్తుంది. చివరికి ఒక చోట గాడిన పడుతుంది. క్లైమాక్స్ అనుకున్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. సింపుల్‌గా  ఎండ్ చేసేసినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్‌లో  ఇంకాస్త ఫోకస్ ఎక్కువ పెట్టి వుంటే బాగుండేది. పాటలు విజువల్‌గా బాగున్నప్పటికీ,  కొన్ని చోట్ల సీరియస్ ఫ్లోకి డిస్ట్రబెన్స్‌లా అనిపిస్తాయ్. కట్ చేసేసి వుంటే బాగుండేదనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ, విజుెవల్ ఎఫెక్ట్స్‌లో అక్కడక్కడా కొన్ని లోపాలు క్లియార్‌గా బయటపడిపోయాయ్. మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ బాగుంది.

ప్లస్ పాయింట్స్:
నితిన్ పర్ృపామెన్స్, రాజేంద్ర ప్రసాద్ - వెన్నెల కిషోర్ కామెడీ కెమిస్ట్రీ, ఫస్టాఫ్.. 

మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో చాలా చోట్ల దొరికిపోయిన లోపాలు, వీక్ క్లైమాక్స్, రొటీన్ అనిపించిన గంజాయ్ ఎపిసోడ్స్, 

చివరిగా:
ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళితే, ‘రాబిన్‌హుడ్’ వీకెండ్ ఎంటర్‌టైనర్‌గా  ఓకే అదిదా సర్‌ప్రైజు.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com