అద్దె వివాదాల్లో చిక్కుకున్న 86 మంది ఖైదీల విడుదల..!!
- March 28, 2025
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ కు ముందు, అద్దె సంబంధిత క్లెయిమ్లపై నిర్బంధించబడిన మొత్తం 86 మంది ఖైదీలను దుబాయ్లో విడుదల చేశారు. దుబాయ్ అద్దె వివాదాల కేంద్రం, మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హ్యుమానిటేరియన్ & ఛారిటీ ఎస్ట్ మద్దతుతో మొత్తం Dh6.8 మిలియన్లకు పైగా ఉన్న బకాయి ఆర్థిక క్లెయిమ్లను పరిష్కరించడంతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు.
దుబాయ్ అద్దె వివాదాల కేంద్రం ఛైర్మన్ జడ్జి అబ్దుల్ ఖాదర్ మౌసా మొహమ్మద్ మాట్లాడుతూ.. ఈ చొరవ చట్టం-మానవత్వం రెండింటి స్ఫూర్తికి అనుగుణంగా వెనుకబడిన వారికి మద్దతు అందించడానికి నిర్దేశిందని తెలిపారు. అన్ని పార్టీల హక్కులను నిర్ధారిస్తూనే, సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి సంస్థలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
గత నెలలో రమదాన్ పండుగకు ముందు, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. దుబాయ్లోని వివిధ దేశాలకు చెందిన 1,518 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!







