పుతిన్ లగ్జరీ కారులో భారీ పేలుడు
- March 30, 2025
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన అధికారిక కార్లలో అత్యంత లగ్జరీ కారు అయిన లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. మాస్కో నడిబొడ్డున జరిగిన ఈ ఘటన రష్యా అధ్యక్షుడి భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో ప్రపంచ నేతలంతా ఉలిక్కిపడ్డారు. రష్యా మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. పుతిన్‌కు చెందిన అత్యంత ఖరీదైన కారు లిమోజిన్.. లుబియాంకాలోని ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయం సమీపంలో కాలిపోతూ కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు ఇంజిన్ నుంచి మంటలు ప్రారంభమై వాహనంలోకి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అక్కడికి సమీపంలోని రెస్టారెంట్‌లోని సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో వాహనం నుంచి దట్టమైన నల్లటి పొగ రావడం, కారు వెనుక భాగం దెబ్బతినడాన్ని చూడవచ్చు. ఈ పేలుడుకుగల కారణం ఇంకా తెలియరాలేదని, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యన్ మీడియా పేర్కొంది. ఈ కారును ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తుంటుందని తెలిపింది. పేలుడుపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇదిలావుంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన త్వరలో చనిపోతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఇటీవల వ్యాఖ్యానించారు. గత బుధవారం జరిగిన ఒక ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పుతిన్ కారు తగలబడిన ఘటన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడి మరణాన్ని జెలెన్‌స్కీ ముందే ఊహించారంటూ కథనాలు వెలువడుతున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







