గ్రాండ్ మస్జీదు..122 మిలియన్లకు పైగా విజిటర్స్ సందర్శన..!!

- March 30, 2025 , by Maagulf
గ్రాండ్ మస్జీదు..122 మిలియన్లకు పైగా విజిటర్స్ సందర్శన..!!

మక్కా: పవిత్ర రమదాన్ మాసంలో మక్కాలోని గ్రాండ్ మసీదు, మదీనాలోని ప్రవక్త మసీదుకు మొత్తం 122,286,712 మంది సందర్శకులు వచ్చారని గ్రాండ్ మసీదు,  ప్రవక్త మసీదు వ్యవహారాల జనరల్ అథారిటీ సీఈఓ ఇంజినీర్ ఘాజీ అల్-షహ్రానీ తెలిపారు. గ్రాండ్ మసీదులో మొత్తం 92,132,169 మంది, ప్రవక్త మసీదులో 30,154,543 మంది ఆరాధకులు ఉన్నారని అల్-షహ్రానీ తెలిపారు.

ఈద్ అల్-ఫితర్ సందర్భంగా రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ లకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అల్లాహ్ అతిథులకు సేవ చేయడంలో సహకరించిన వారందరికీ అల్-షహ్రానీ తన కృతజ్ఞతలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com