చెరుకు రసాన్ని వీరు తాగితే ఇక అంతే?

- March 31, 2025 , by Maagulf
చెరుకు రసాన్ని వీరు తాగితే ఇక అంతే?

ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో, మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది చల్లటి పానీయాలు తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే, వేసవి కాలంలో చెరుకు రసానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.చాలా ప్రదేశాల్లో చెరుకు రసాన్ని ఎక్కువగా అమ్ముతుంటారు. ఎండల నుంచి రిలీఫ్ పొందడానికి చెరుకు రసాన్ని చాలా మంది తాగుతుంటారు. చెరుకు రసంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే, కొందరు పొరపాటున కూడా చెరుకు రసాన్ని తాగకూడదు.చెరుకు రసాన్ని ఎవరు ఎందుకు  తాగకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

చల్లదనాన్నిచ్చే చెరుకు రసంలో విటమిన్లు A, B1, B2, B3, C ఉన్నాయి. అంతేకాకుండా కాల్షియం, కాపర్, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. చెరుకు రసంతో అలసట తీరుతుంది. ఎండాకాలంలో కోల్పోయిన శక్తిని చెరుకు రసం తాగడం వల్ల తిరిగి పొందవచ్చు.పచ్చకామెర్లతో బాధపడేవారికి చెరుకు రసం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అయితే, కొందరు వ్యక్తులు చెరుకు రసాన్ని తాగకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు

జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, జీర్ణ సమస్యలతో బాధపడేవారు పొరపాటున కూడా చెరకు రసం తీసుకోకూడదు.ఎందుకంటే చెరకు రసంలో ఉండే పోలికోసనాల్ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల కడుపు నొప్పి, విరేచనాలు వంటి అనేక సమస్యలు వస్తాయి. ఇప్పటికే అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు వైద్యుణ్ని సంప్రదించి చెరుకు రసాన్ని తీసుకోవడం మంచిది.

చెరకు రసంలో పోలికోసనాల్ అనే మూలకం కనిపిస్తుంది. ఇది రక్తాన్ని పలుచబరిచేందుకు పనిచేస్తుంది. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టడానికి అనుమతించదు. కొన్నిసార్లు ఇది చాలా హానికరం. ఎందుకంటే గాయం సంభవించినప్పుడు అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల, దీనిని రక్తం పలుచగా ఉన్న సమస్యలతో బాధపడేవారు తీసుకోకూడదు.

ఈ రోజుల్లో చాలా మంది ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాదఫడుతున్నారు. ఇలాంటి వారు చెరుకు రసాన్ని తాగకపోవడమే మేలు అంటున్నారు డాక్టర్. చెరుకు రసంలో అధిక కేలరీలు, చక్కెర శాతం ఉండటం వల్ల ఇది ఊబకాయం సమస్యను మరింత పెంచుతుంది. చెరుకు రసంలో దాదాపు 270 కేలరీలు, దాదాపు 100 గ్రాముల చక్కెర ఉంటుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెరుకు రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

చెరకు రసం మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 240 మి.లీ చెరకు రసంలో 50 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది 12 టీస్పూన్లకు సమానం. అయితే, చెరకు రసంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉంటుంది. అయితే గ్లైసెమిక్ లోడ్ (GL) ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా, డయాబెటిస్ ఉన్న రోగులు చెరకు రసాన్ని ఎక్కువగా తాగకూడదు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com