అంబేద్కర్ జయంతి రోజు జాతీయ సెలవు దినం: ప్రకటించిన కేంద్రం
- March 31, 2025
న్యూ ఢిల్లీ: డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14న ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. సమాజానికి, రాజ్యాంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు. రాజ్యాంగ నిర్మాత, సమాజంలో సమానత్వం కోసం కొత్త శకాన్ని స్థాపించిన బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతిని ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటినట్లు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. బీఆర్ అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించడం పట్ల ప్రధాని మోదీ అంకిత భావం గుర్తించాలని ఆయన అన్నారు. దేశ ప్రజల మనోభావాలను గౌరవించి ప్రదాని ఈ నిర్ణయం తీసుకున్నారని గజేంద్ర సింగ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆధార్ కొత్త నియమాలు తెలుసా
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!







