సౌదీలో టీకాలు వేసుకున్న యాత్రికులకే అనుమతి..!!
- March 31, 2025
మక్కా: నుసుక్ యాప్,అధికారిక ఎలక్ట్రానిక్ పోర్టల్ ద్వారా సౌదీలోని పౌరులు, నివాసితులకు హజ్ 1446H ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని హజ్,ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన వాతావరణంలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఇస్లాం ముఖ్యమైన కార్యక్రమాన్ని నెరవేర్చడానికి అనుమతి ఇవ్వనున్నారు.గతంలో హజ్ చేయని వారికి బుకింగ్ కోసం ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ప్రకటించారు.తప్పనిసరి మెనింజైటిస్ టీకాను పూర్తి చేసిన వ్యక్తులకు మాత్రమే ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాగా, “సెహ్హతి” యాప్ ద్వారా ఏదైనా ఆరోగ్య కేంద్రంలో టీకా అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







