'అర్జున్ S/O వైజయంతి' సినిమాకి U/A సెన్సార్ సర్టిఫికేట్
- April 08, 2025
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ అవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. సెన్సార్ సహా అన్ని లాంఛనాలతో ఈ చిత్రం పూర్తయింది.సెన్సార్ బోర్డ్ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చింది.
సినిమా 2 గంటల 24 నిమిషాల రన్ టైమ్ తో యాక్షన్, ఎమోషన్, థ్రిల్స్ సమపాళ్లలో బ్లెండ్ చేస్తోంది. అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాలు, మనసుని కదిలించే మదర్ అండ్ సన్ డ్రామా.. ప్రతి క్షణం గ్రిప్పింగ్ గా ఉంటుందని హామీ ఇస్తుంది.
కళ్యాణ్ రామ్ బాధ్యతాయుతమైన కొడుకు పాత్రను పవర్ ఫుల్ గా చిత్రీకరించడం,తల్లిగా విజయశాంతి కమాండింగ్ ప్రజెన్స్ ఎమోషన్స్ ని మరింతగా పెంచుతుంది.కథ ముందుకు వెళ్తున్న కొద్దీ సెకండ్ హాఫ్ తల్లి, కొడుకుల బాండింగ్, ఎమోషనల్ డెప్త్ హై-ఆక్టేన్ యాక్షన్‌తో బ్లెండ్ చేస్తుంది. క్లైమాక్స్ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వుంటుంది, ప్రేక్షకులు చివరి వరకు తమ సీట్ ఎడ్జ్ లో ఉండేలా చేస్తుంది.
ప్రదీప్ చిలుకూరి సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. రామ్ ప్రసాద్ వండర్ ఫుల్ సినిమాటోగ్రఫీ, బి అజనీష్ లోక్‌నాథ్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ హైలెట్ గా వుండబోతోంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సినిమాని అత్యున్నతంగా నిర్మించారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాన్ని అందించినందుకు సెన్సార్ అధికారులు టీంని ప్రశంసించారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ని కూడా అభినందించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







