బాల్కనీలో బట్టలు ఆరబెడితే..Dh2,000 వరకు జరిమానా..!!
- April 14, 2025
యూఏఈ: అబుధాబిలో అధికారులు పబ్లిక్ రోడ్లపై బ్యూటీఫికేషన్ ను కాపాడటానికి, పట్టణ వాతావరణాన్ని కొనసాగించడానికి మార్గదర్శకాలను విడుదల చేశారు. వాటి ప్రకారం.. అబుదాబిలోని పబ్లిక్ రోడ్లకు ఎదురుగా ఉన్న కిటికీలు , బాల్కనీలపై క్లాత్స్, లేదా కార్పెట్లు, కవరింగ్‌లను శుభ్రం చేయడాన్ని నిషేధించారు. ఉల్లంఘనలకు Dh2,000 వరకు జరిమానాలు విధించనున్నారు. మొదటిసారి ఉల్లంఘించిన వారికి Dh500 వరకు జరిమానా విధించబడుతుంది. రెండోసారి ఉల్లంఘన పునరావృతమైతే అధికారులు 1,000 దిర్హామ్‌లు, ఉల్లంఘనలు రిపీటైతే 2,000 దిర్హామ్‌లు విధించనున్నారు.
"అపార్ట్మెంట్ బాల్కనీలో బట్టలు ఆరవేయడం లేదా కిటికీ లేదా రైలింగ్‌కు వేలాడదీయడం భవనం ఇమేజ్ను దెబ్బతీస్తుంది. వీటిని ఇకపై అనుమతించరు." అని అబుదాబి మునిసిపాలిటీ మునుపటి ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







