బొగ్గు కాంతులు
- April 16, 2025
ఎదలోతుల్లో ఏదో తెలియని వెంటాడే దిగులు ఏమాత్రం మోములో విప్పారని ముకుళిత వదనాలు ఏరోజు కారోజు వెలుగులేక ఆవిరయ్యే వేదనలు ఏకనులు చూసిన తడేలేక సోలిపోయే నయనాలు ...
ఏకాకులు కాదు ఏకమైన కరిగించిన కండలు
ఎటుచూసినా లేరుగా మీకన్న బలవంతులు
ఏక్షణమైన కలిసికట్టుగా సాగే సమసమాజ నిర్మాతలు
నిరంకుశత్వ పాలనలో శుష్కించిన దేహాలు...
సమసమాజంలో ప్రాణాలు లెక్కచేయక
మసితోనే జీవనమనేలా శరవేగంగా నిక్షేపాలు
వెలికితీస్తూ సంకల్ఫబలంతో కొనసాగుతూ
ఆవాసనే సుగంధంలా భరిస్తూ స్వర్గంలా భావించి
గనిలోకి అడుగిడి సర్వంమరచి ...
అడ్డొచ్చే రాళ్ళని...లెక్కచేయక నిరంతరం
ఏమర్మం తెలియక నమ్మిన వృత్తినే దైవంగా భావిస్తూ నీచిన్ని హృదయంలో తొలచే ఆలోచనలకి తావీయక
మదిలోని వ్యధలన్నింటిని పొరలుగా కప్పి కానరానీయక
ఏమిటీ జీవనమని ఏమాత్రం నిను నీవు ప్రశ్నించుకోక
ఏదైనా నను నమ్మిన నావారికై అని పొద్దనక రాత్రనక
ఏ హక్కులకైనా పోరాడక చట్టాన్ని ఉల్లంఘించక
ఏది నీ గుర్తింపు ఏది నీదైన ఫలితం ఎక్కడ నీ వెలుగులు
ఏది కోరక సాగించేవు నీ జీవనగమనం ...
--యామిని కోళ్ళూరు
తాజా వార్తలు
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!