'తుడరుమ్' ఏప్రిల్ 26న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
- April 22, 2025
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తుడరుమ్'. వెటరన్ హీరోయిన్ శోభన మోహన్ లాల్ కి జోడిగా నటించారు. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎం. రంజిత్ నిర్మించారు.
ఈ రోజు ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఎమోషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రోలర్ కోస్టర్ రైడ్ గా ట్రైలర్ కట్టిపడేసింది. మోహన్ లాల్ ట్యాక్సీ డ్రైవర్ గా ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఓ కారు, ఫ్యామిలీ చుట్టూ ఆసక్తికరంగా నడిచిన ట్రైలర్ సినిమాపై కథపై చాలా క్యురియాసిటీని పెంచింది.
మోహన్ లాల్ నేచురల్ అండ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలిచింది. మోహన్ లాల్, శోభన అన్ స్క్రీన్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది.
దర్శకుడు తరుణ్ మూర్తి కథని చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశాడు. జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం ఎక్సయిటింగా వుంది. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో వుంది.
ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో దీపా ఆర్ట్స్ పి శ్రీనివాస్ గౌడ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
నటీనటులు: మోహన్ లాల్, శోభన, మణియంపిల్ల రాజు,బిను పప్పు, ఇర్షాద్ అలీ, ఫర్హాన్ ఫాజిల్ , థామస్ మాథ్యూ, షైజో ఆదిమాలి
దర్శకత్వం: తరుణ్ మూర్తి
నిర్మాత: ఎం. రంజిత్
తెలుగు రిలీజ్: దీపా ఆర్ట్స్- పి శ్రీనివాస్ గౌడ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కె.ఆర్.సునీల్, తరుణ్ మూర్తి
సినిమాటోగ్రఫీ: షాజీ కుమార్
ఎడిటర్: షఫీక్ V.B, నిషాద్ యూసుఫ్
సంగీతం: జేక్స్ బిజోయ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అవంతిక రెంజిత్
కథ: కేఆర్ సునీల్
ఆడియోగ్రాఫర్: విష్ణు గోవింద్
ప్రొడక్షన్ డిజైన్: గోకుల్దాస్
పీఆర్వో: వంశీ- శేఖర్
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







