సౌదీ గగనతలంలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం..
- April 22, 2025
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ విమానానికి 3 యుద్ధ విమానాలు ఎస్కార్ట్ గా వచ్చాయి. సౌదీ వైమానిక దళానికి చెందిన F15 విమానం ప్రధాని మోదీని కాపాడుతూ ఆకాశంలో రక్షణగా నిలిచాయి.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నారు. సౌదీలో ప్రధాని మోదీకి ఆపూర్వ స్వాగతం లభించింది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రెండు రోజుల పర్యటన కోసం జెడ్డాలో అడుగుపెట్టారు. ప్రధాని విమానానికి రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన F15 విమానం భద్రత కల్పించింది. ఈ పర్యటన 40 సంవత్సరాలలో ఒక భారత ప్రధానమంత్రి జెడ్డాకు చేసిన మొదటి పర్యటన.
భారతదేశం, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. సౌదీ అరేబియాను విశ్వసనీయ స్నేహితుడుగా, వ్యూహాత్మక మిత్రదేశంగా ఆయన అభివర్ణించారు. 2019లో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పడినప్పటి నుండి, ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన విస్తరణ జరిగిందని ఆయన అన్నారు.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు తన రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటన గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఒక పోస్ట్‌లో తెలియజేశారు. ప్రధానమంత్రి మోదీ తన రెండు రోజుల గల్ఫ్ దేశ పర్యటనలో భాగంగా త్వరలో జెడ్డా చేరుకుంటారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో రెండు దేశాలు పరస్పరం ప్రయోజనకరమైన, బలమైన భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు.
భారతదేశం – సౌదీ అరేబియా కలిసి ముందుకు సాగుతాయని ప్రధాని మోదీ చెప్పినట్లు అరబ్ న్యూస్ తెలిపింది. ఇరు దేశాల ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచం కోసం శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేస్తారన్నారు.
సౌదీ అరేబియా రక్షణ మార్కెట్‌పై గ్లోబల్‌డేటా సమాచారం ప్రకారం, మధ్యప్రాచ్య ప్రాంతంలో బోయింగ్-నిర్మిత రక్షణ వేదికల అతిపెద్ద ఆపరేటర్లలో కింగ్డమ్ ఒకటి. దాని రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో 207 F-15 SA , 62 F-15 ఈగిల్ జెట్ ఫైటర్లు ఉన్నాయి. ప్రధాని మోదీ ఏప్రిల్ 22 – 23 తేదీలలో సౌదీ అరేబియా పర్యటనలో ఉంటారు.
ప్రధానమంత్రి మోదీ, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశం-సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి రెండవ సమావేశానికి సహ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని జోడిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాతో తన దీర్ఘకాల, చారిత్రక సంబంధాలకు భారతదేశం గొప్ప ప్రాముఖ్యతను ఇస్తుందని బయలుదేరే ముందు ప్రధానమంత్రి మోదీ అన్నారు. రక్షణ, వాణిజ్యం, శక్తి, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాలలో భాగస్వామ్యం కొత్త ఊపు సాధించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







