కువైట్ విమానాశ్రయానికి భారీ ఎదురుదెబ్బ..!!
- May 02, 2025
కువైట్: ప్రధాన గల్ఫ్ విమానాశ్రయాలు ప్రయాణీకుల, కార్గో ట్రాఫిక్‌లో రికార్డు స్థాయిలో వృద్ధిని సాధిస్తుండగా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం స్తబ్దతను ఎదుర్కొంటోంది. అధికారిక నివేదిక ప్రకారం.. ఆర్థిక మాంద్యం పేరుతో అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు కార్యకలాపాలను నిలిపివేస్తున్నారు.
మార్చి 2024 ప్రారంభంలో బ్రిటిష్ ఎయిర్వేస్ కువైట్‌కు తన రోజువారీ విమానాలను నిలిపివేసి 60 సంవత్సరాల నిరంతర సేవలను ముగించింది. ఇది సెప్టెంబర్ 2023లో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, అంతకు ముందు నెదర్లాండ్స్‌కు చెందిన KLM కువైట్ లో తమ సేవలను రద్దు చేశాయి. మొత్తంగా 14 అంతర్జాతీయ విమానయాన సంస్థలు కువైట్ విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేసాయి. అదే సమయంలో అవి గల్ఫ్‌లోని ఇతర విమానాశ్రయాలకు సేవలను విస్తరించాయి.
కువైట్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేసిన విమానయాన సంస్థలలో బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్స, KLM రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, థాయ్ ఎయిర్వేస్, డెల్టా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్వేస్, కాథే పసిఫిక్, సెబు పసిఫిక్ ఎయిర్, ఫిలిప్పీన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్, స్విస్ ఎయిర్, రాయల్ బ్రూనై ఎయిర్‌లైన్స్, కొరియన్ ఎయిర్ లైన్స్ ఉన్నాయి.
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల రద్దీ 2024లో 1% తగ్గింది. 2023లో 15.6 మిలియన్లు ఉండగా, అది 15.4 మిలియన్లకు పడిపోయింది.అదే సమయంలో ఇతర గల్ఫ్ విమానాశ్రయాలు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ 5.7% పెరిగి 92.3 మిలియన్ల ప్రయాణికులకు, దోహా 14.8% పెరిగి 52.7 మిలియన్లకు, రియాద్ 17.8% పెరిగి 37.6 మిలియన్లకు, అబుదాబి 25.3% పెరిగి 28.7 మిలియన్లకు చేరుకోవడం విశేషం.
తాజా వార్తలు
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్‌కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్‌కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్‌ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!







