సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. సివిల్ డిఫెన్స్ హెచ్చరిక..!!
- May 02, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం వరకు భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, వరదలకు గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, వివిధ మీడియా సంస్థల ద్వారా షేర్ చేసిన భద్రతా మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
మక్కా ప్రాంతంలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు, వడగళ్ళు, బలమైన గాలులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రియాద్ ప్రాంతంలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేయగా.. మదీనా, హైల్, ఖాసిమ్, నార్తర్న్ బోర్డర్స్, తూర్పు ప్రావిన్స్, అల్-బహా, అసిర్, జాజాన్ వంటి ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర నజ్రాన్ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







