వీరు బంగాళదుంపల్ని తింటే, ఇక అంతే సంగతులు...!
- May 05, 2025
బంగాళదుంప..పేరు చెప్పగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. వీటి రుచికి ఫిదా అవ్వని భోజన ప్రియుడు ఉండరు అంటే అతిశయోక్తి కాదు అనిపిస్తుంది. బంగాళదుంప కూర, బంగాళదుంప పులుసు, బంగాళదుంప ఫ్రై వంటి రకరకాల డిష్‌లు చేస్తుంటారు. కొందరు కూరలు చేస్తుంటే, మరికొందరు స్నాక్స్‌గా బంగాళదుంపలు తింటుంటారు. ఇక, వెస్ట్ బెంగాల్‌లో అయితే బిర్యానీలో బంగాళదుంపల్ని కలిపి వండి తింటారు.
బంగాళదుంపల్లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో బంగాళదుంపలు నిండి ఉంటాయి. బంగాళాదుంపల్లో తగినంత పరిమాణంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు కూడా కనిపిస్తాయి. ఆయుర్వేద ప్రకారం బంగాళదుంపల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే, ఇంత మేలు చేసినప్పటికీ కొందరు బంగాళదుంపను తినకూడదు. వారెవరో తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలా మంది అధిక రక్తపోటు, లో బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు బంగాళదుంపలకు దూరంగా ఉండాలి. రక్తపోటు రోగులు బంగాళాదుంపలను సమతుల్య పరిమాణంలో తినాలి. అనేక పరిశోధనలు, అధ్యయనాలు నిర్ధారించిన ప్రకారంయయ అధిక రక్తపోటు సమస్య వారు బంగాళాదుంపలు తినడం వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరిగి గుండె ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహ రోగులు బంగాళాదుంపలు తినకుండా ఉండాలి. టైప్ 2 డయాబెటిస్ లేదా అధిక రక్తంలో చక్కెరతో బాధపడేవారు బంగాళాదుంపలను తినకుండా ఉండాలి. బంగాళాదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. బంగాళదుంపలు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాన్ని అంటే శరీరంలో గ్లూకోజ్‌ను పెంచుతుంది. అధిక రక్తంలో చక్కెర సమస్యతో బాధపడేవారు దీనిని తినకుండా ఉండాలి.
ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడేవారు బంగాళదుంపల్ని ఎక్కువగా తినకూడదు. ఇప్పటికే ఊబకాయంతో బాధపడుతూ.. బరువు తగ్గాలనుకునేవారు బంగాళదుంపలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం ప్రమాదం పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు తీసుకునే ఆహారంలో బంగాళదుంపల పరిమాణాన్ని తగ్గించుకోండి.
అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం ఆర్థరైటిస్ రోగులు కూడా బంగాళాదుంపలు తినకుండా ఉండాలి. ఆర్థరైటిస్, గౌట్ రోగులు బంగాళాదుంపలను పరిమిత పరిమాణంలో తినాలి. మీరు ఆర్థరైటిస్ రోగి అయితే, తక్కువ నూనెలో ఉడికించి, తొక్కతో కూడిన బంగాళాదుంపలను తినాలి. బంగాళాదుంపలలో ఉండే కార్బోహైడ్రేట్లు ఆర్థరైటిస్ రోగుల సమస్యలు మరింత పెంచుతాయి. దీంతో కాళ్లు, కీళ్ల నొప్పులు మరింత ఎక్కువ అయితాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







