విదేశాలలో నిర్మించే చిత్రాలకు 100 శాతం సుంకం
- May 05, 2025
అమెరికా: సుంకాల మోతతో ఇప్పటికే ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సినిమాలను వదలకుండా తాజాగా టారిఫ్ పిడుగు వేశారు. అమెరికాలో కాకుండా విదేశాల్లో నిర్మించి.. అమెరికాలో విడుదల చేసే సినిమాలపై వంద శాతం సుంకాన్ని విధిస్తున్నట్లుగా పేర్కొంటూ షాకిచ్చారు. ట్రంప్ సుంకాల మోతతో ఇప్పటికే ఆర్థిక రంగానికి పెద్ద విలన్ గా మారిన ఆయన.. తాజాగా సినిమా ఇండస్ట్రీని వదిలేది లేదన్నట్లుగా ఆయన తీరు ఉంది.
కొందరు హాలీవుడ్ ను నాశనం చేస్తున్నారని.. అందుకే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా తన సోషల్ మీడియా వేదికలో పోస్టు పెట్టిన ట్రంప్.. తన చర్యను సమర్థించుకునేలా వాదనను వినిపించారు. “అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతోంది. మా దర్శక నిర్మాతలు.. స్టూడియోలను యూనైటెడ్ స్టేట్స్ నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దీంతో హలీవుడ్ తో పాటు ఇతర సినీ రంగ విభాగాలు నాశనమవుతున్నాయి” అంటూ తన నిర్ణయం వెనుకున్న విషయాన్ని వివరించారు.
హాలీవుడ్ ను దెబ్బ తీయటానికి ఇతర దేశాలు చేస్తున్న సమిష్ఠి కుట్రగా పేర్కొన్న ట్రంప్.. ‘దీన్ని దేశభద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నాం. అందుకే విదేశీ గడ్డపై నిర్మించి మన దేశంలోకి వచ్చే సినిమాలపై 100 శాతం సుంకం విధించే ప్రకరియను వెంటనే ప్రారంభించేలా ఆయా శాఖకు అధికారాలు ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. ట్రంప్ పోస్టు నేపథ్యంలో ఈ అంశంపై అమెరికా వాణిజ్య మంత్రి టుట్నిక్ స్పందిస్తూ.. తాము ఈ అంశంపై పని చేస్తున్నట్లుగ వెల్లడించారు.
ట్రంప్ ప్రకటన నేపథ్యంలో అసలేం జరిగిందన్న అంశాన్ని చూస్తే.. హాలీవుడ్ బయట షూట్ చేసే సినిమాలు.. టీవీ కార్యక్రమాలకు కొన్ని నగరాల్లో భారీ ఎత్తున పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. ఈ కారణంగా కొన్ని నిర్మాణ సంస్థలు తమ కార్యకలాపాల్ని హాలీవుడ్ నుంచి కెనడా.. ఐర్లాండ్ లోని కొన్ని నగరాలకు తరలి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా ప్రకటన చేసి ఉంటారని చెబుతున్నారు. ట్రంప్ పోస్టు నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం.. వంద శాతం టారిఫ్ విధిస్తామని చెప్పారు సరే. ఈ అంశానికి సంబంధించి పలు సందేహాలు తెర మీదకు వస్తున్నాయి. వాటిల్లోకి వెళితే.. – అమెరికాలో సినిమాలను విడుదల చేసే విదేశీ నిర్మాణ సంస్థలకు టారిఫ్ లు విధిస్తారా? – ఓవర్ సీస్ లో నిర్మించే అమెరికా సినిమాలపై సుంకాలు విధిస్తారా? – సినిమాను వస్తువుగా కాకుండా మేధో సంపత్తిగా చూస్తున్న వేళ.. ట్రంప్ టారిఫ్ ఎలా విధిస్తారా? వాటికి త్వరలోనే ట్రంప్ సమాదానం ఇస్తారని ప్రపంచ సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







