చారిత్రక దిరియాలో పర్యటించిన క్రౌన్ ప్రిన్స్, ట్రంప్..!!

- May 14, 2025 , by Maagulf
చారిత్రక దిరియాలో పర్యటించిన క్రౌన్ ప్రిన్స్, ట్రంప్..!!

రియాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో కలిసి అల్-సౌద్ కుటుంబం పూర్వీకుల నివాసమైన దిరియాలోని చారిత్రాత్మక అట్-తురైఫ్ జిల్లాలో పర్యటించారు.ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఇద్దరు నాయకులు సౌదీ రాష్ట్ర జన్మస్థలాన్ని ప్రపంచ సాంస్కృతిక,  వారసత్వ కేంద్రంగా మార్చడానికి నిర్దేశించిన అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌ను వీక్షించారు.

ఐకానిక్ సల్వా ప్యాలెస్ ముందు నిలబడి, శతాబ్దాల నాటి సౌదీ చరిత్రకు పుట్టినిల్లుగా.. జాతీయ గుర్తింపుకు శక్తివంతమైన చిహ్నంగా పరిగణించబడే మట్టి ఇటుక ప్యాలెస్‌లు, ముఖ్యమైన మైలురాళ్లను వారు చూశారు. రాజ్యం దాని 300వ వార్షికోత్సవ వేడుకలకు కేవలం రెండు సంవత్సరాల ముందు వారు సందర్శిండం ప్రత్యేకమైనదిగా నిలచింది.  

దిరియాలో జరుగుతున్న భారీ అభివృద్ధి ప్రోగ్రామ్స్ గురించి క్రౌన్ ప్రిన్స్ ట్రంప్‌కు వివరించారు.  ఇది వారసత్వ సంరక్షణను అత్యాధునిక పట్టణ అభివృద్ధితో కలపడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తన రెండవ పదవీకాలంలో తన మొదటి అధికారిక విదేశీ పర్యటన కోసం ముందుగా రియాద్‌కు వచ్చిన ట్రంప్.. ఈ దార్శనికతను "ధైర్యమైనది, స్ఫూర్తిదాయకం"గా అభివర్ణించారు.

ఈ పర్యటన సౌదీ అరేబియా విస్తృత సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని హైలైట్ చేసింది. ఇందులో 2017లో జారీ చేయబడిన రాజు ఆదేశాల ప్రకారం..  దిరియాను ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ, సాంస్కృతిక నగరంగా మార్చడం కూడా ఉంది. దిరియా పునరుజ్జీవనం సౌదీ-యుఎస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం,  రెండు మిత్రదేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాల కొత్త ప్రారంభాలతో కలిపి ఉండనుంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com