దుబాయ్ పోలీస్ సమ్మిట్.. హైదరాబాద్ సీపీ ఆనంద్‌కు 'ఎక్సలెన్స్' అవార్డు..!!
- May 16, 2025
దుబాయ్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అరుదైన ఘనతను సాధించారు. దుబాయ్ పోలీసులు నిర్వహించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ (WPS)-2025లో మొదటిస్థానంలో నిలిచి "ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డు" ను అందుకున్నారు.
హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (HNEW) తరఫున హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం చేపట్టిన ముందస్తు చర్యలు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని విద్యార్థులు, కమ్యూనిటీలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, గత మూడు సంవత్సరాలలో సాధించిన విజయాలకు గుర్తుగా ఈ అంతర్జాతీయ అవార్డుకు హైదారబాద్ నార్కోటిక్ విభాగాన్ని ఎంపికచేశారు. ఈ విభాగానికి అధిపతిగా సీవి ఆనంద్ అవార్డును నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నారు.
దుబాయ్‌లోని దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో వరల్డ్ పోలీస్ సమ్మిట్ కమిటీ నుండి సీవి ఆనంద్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. 138 దేశాల నుండి ప్రముఖ పోలీసు అధికారులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సమర్థవంతమైన పోలీసులతో పోటీపడి హైదరాబాద్ నగర పోలీసుల నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఈ అవార్డును గెలుచుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక అవార్డును సాధించడంలో తన బృంద సభ్యుల కృషి, అంకితభావాన్ని ఆయన అభినందించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







