జూన్ 6వ తేదీన ఈద్ అల్-అధా.. అల్-అజారి సెంటర్ ప్రకటన..!!
- May 19, 2025
కువైట్: ఖగోళ గణనల ఆధారంగా ఈద్ అల్-అధా జూన్ 6వ తేదీన ఉంటుందని అల్-అజారి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. కేంద్రం ప్రకటన ప్రకారం.. ధు అల్-హిజ్జా 1446 AH నెలవంక మే 28న ఇస్లామిక్ నెల ప్రారంభానికి గుర్తుగా కనిపిస్తుంది. అరఫా దినం జూన్ 5వ తేదీన వస్తుందని భావిస్తున్నారు. మే 27వ తేదీన తెల్లవారుజామున నెలవంక కనిపించడం ప్రారంభం అవుతుందని, అదే రోజు సూర్యాస్తమయం తర్వాత నెలవంక స్పష్టంగా కనిపిస్తుందని కేంద్రం తెలిపింది. కువైట్‌లో నెలవంక దాదాపు 43 నిమిషాల పాటు ఆకాశంలో కనిపిస్తుందని, అయితే ఇతర అరబ్, ఇస్లామిక్ దేశాల రాజధానులలో 40 నుండి 58 నిమిషాల వరకు కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు జూన్ 6న ఈద్ అల్-అధాను వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







